కర్రసాము..రవీంద్రభారతిలో వర్క్‌షాప్‌

482
కర్రసాము..రవీంద్రభారతీలో వర్క్‌షాప్‌
- Advertisement -

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో కర్రసాముపై వర్క్‌ షాప్ నిర్వహించనున్నారు. నేటి నుంచి 45 రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు.

కర్రసాములో పీహెచ్‌డీ సాధించిన డా. ఆకుల శ్రీధర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన కర్రసాము ద్వారా మహిళలు తమపై జరిగే దాడులను అరికట్టే ప్రయత్నం చేయవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు.

- Advertisement -