షాకింగ్…పులికి కరోనా!

301
tiger
- Advertisement -

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది కరోనా వైరస్. ఈ మహమ్మారితో లక్షలాదిమంది చికిత్స పొందుతుండగా వేలాదిమంది చనిపోయారు. అయితే ఇప్పటివరకు మనుషులపై మాత్రమే పంజా విసిరిన కరోనా…తాజాగా జంతువులపై కూడా ప్రభావం చూపుతోంది.

అమెరికాలోని న్యూయార్క్‌ బ్రాంగ్జ్‌ జూపార్క్‌లో ఉండే నదియా అనే నాలుగేళ్ల పులికి వైరస్‌ సోకిందని జూ యాజమాన్యం తెలిపింది. జూలోని పులి పదేపదే దగ్గుతుండటంతో అధికారులు వ్యయప్రయాసలతో పులికి కరోనా టెస్టులు చేశారు. కరోనా టెస్టులు చేయడంతో ఈ విషయం బయటపడింది. నదియా అనే నాలుగేళ్ల ఈ పులితో పాటుగా అజుల్ అనే మరో పులి, మూడు ఆఫ్రికన్ సింహాలలో కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని జూ నిర్వాహకులు చెప్తున్నారు.

నదియాకు కరోనా పరీక్షలు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆకలి మందగించటం మినహా.. వాటి ఆరోగ్యంగానే బాగానే ఉందని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ సింహాలను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -