కేసీఆరే మా ధైర్యం: బండ్ల గణేష్

432
bandla ganesh
- Advertisement -

సీఎం కేసీఆర్‌పై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్. దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రతి ముఖ్యమంత్రి మన కేసీఆర్ లాగా ఉండుంటే ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్ గా ఉండేదని…జై కేసీఆర్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన బండ్ల…మీరు రాష్ట్రానికి పెద్దన్న సార్ మీ ధైర్యం మీ నిబద్ధత మీ మాట మాకు వేదం సార్ మీ మాటలు వింటుంటే మా కళ్ళు చెమరుస్తాయి సార్ డాక్టర్ విషయంలో కార్మికుల విషయంలో సీఎం గిఫ్ట్ విధానం అద్భుతం సార్ అంటూ కొనియాడారు.

బతికుంటే బలుసాకు తినొచ్చు అన్న మీ మాట సికింద్రాబాదులోని జరిగిన ఒక కన్నతల్లి ఉదాహరణ.. మీ మనసుకు మా పాదాభివందనం మీకు దైవానుగ్రహం ఉంది సార్ అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

హీరో… రియల్ హీరో ఒక చరిత్ర మీరు మాకు ధైర్యం మీరు తెలంగాణ ప్రజల ఆస్తి…సపాయి అన్న మీకు సాలం అన్న మీ మాట అది మీ నిజాయితీకి తార్కాణం జై కేసీఆర్ అంటూ ట్విట్‌లో పేర్కొన్నారు.

మీరు జాతి రత్నం సార్ దయచేసి ప్రతి రోజు ప్రెస్ మీట్ పెట్టండి మాకు ధైర్యం వస్తుంది..దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి కెసిఆర్ నాయకత్వంలో పని చేయండి రాష్ట్రం కోసం దేశం కోసం ప్రజల కోసం ఇది ఎమర్జెన్సీ సమయం అంటూ పేర్కొన్నారు బండ్ల.

bandla ganesh

- Advertisement -