- Advertisement -
ఇండియాలో మరో నలుగురికి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్లు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29కి చేరింది. గత మూడు రోజుల్లో 25 మంది ఈ కొత్త వైరస్ బారిన పడగా.. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త రకం కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త రకం కేసులు.. ఇండియాతోపాటు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ దేశాల్లో వెలుగు చూశాయి.
దేశవ్యాప్తంగా నమోదైన 29 కరోనా బ్రిటన్ వేరియంట్ కేసులు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 కేసులు, బెంగళూరులో 10, హైదరాబాద్‌లో 3, పుణెలో 5, బెంగాల్‌లోని కళ్యాణిలో 1 కేసు నమోదైయ్యాయి.
- Advertisement -