ఇతర దేశాలు నుంచి వచ్చిన వారు కచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి..

55
d m c ramesh reddy

ట్రేసింగ్ ,టెస్టింగ్ ,ట్రీట్మెంట్ ని పకడ్బందీగా నిర్వహిస్తున్నాము. యూకే ,ఇతర దేశాలు నుంచి వచ్చిన వారు కచ్చితంగా టెస్ట్‌ చేయించుకోవాలని డి ఎమ్ ఈ రమేష్ రెడ్డి తెలిపారు. యూకే నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే వారిలో,సెకండ్ స్ట్రైన్ ఉంటే,అలాంటి వారి కోసం ప్రత్యేక వార్డులో ఏర్పాటు చేసినం. హైద్రాబాద్‌లో టిమ్స్‌లో ప్రత్యేకంగా 2 ఫ్లోర్‌లలో కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలు కూడా స్ట్రైన్ 2 కోసం ప్రత్యేక వార్డ్‌లో ఏర్పాటు చేయడం జరిగింది.

పాజిటివ్ వచ్చిన పేషెంట్ ఎవరైనా ఉంటే వారి శాంపిల్ ని సీసీఎంబి కి పంపిస్తాం,సెకండ్ స్ట్రైన్ ఉందా లేదా అని నిర్ధరించుకోవడం కోసం ప్రస్తుతం కరోనా రాష్ట్రంలో కంట్రోల్ ఉంది. ఇదే విధంగా ప్రజలు జాగ్రతలు పాటించాలి. గత సంవత్సరం స్వైన్ ఫ్లూ ఉండడం చూసాం,ప్రస్తుతం ప్రజలు తీసుకుంటున్న జాగ్రతలు వలన కేసులు నమోదు కాలేదని రమేష్‌ రెడ్డి తెలిపారు.