యూకే విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం ఎత్తివేత..

54
Hardeep Singh Puri

బ్రిటన్‌లో నూతన వేరియంట్ కరోనా కేసులు నమోదు కావడంతో గత నెల 23వ తేదీ నుండి యూకే-ఇండియా మధ్య విమానా రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధంపై కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. జనవరి 8వ తేదీ నుండి యూకే- ఇండియా మధ్య విమాన రాకపోకలు ప్రారంభం కానునట్లు కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరి తెలిపారు.

జనవరి 23వరకు వారానికి 15 విమానాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు హర్దిప్ సింగ్ పూరి వెల్లడించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నుండి మాత్రమే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈవిషయాన్ని కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరి ట్విట్టర్‌లో ప్రకటించారు.