ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు- ఎమ్మెల్సీ కవిత

46
kavitha

రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆనందంగా జీవించాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. నుతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎమ్మెల్సీ కవితకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లోని నివాసంలో కలిసి పుష్పగుచ్చాలు అందించి న్యూ ఈయర్ విషెస్ తెలిపారు.

మంత్రివర్యులు మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు మానిక్ రావు, క్రాంతి కిరణ్, ముఠా గోపాల్, కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్సీ కవితకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ నేతలు మర్రి రాజశేఖరరెడ్డి, అరికెల నర్సారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ ‌కవిత గారికి విషెస్ తెలియజేశారు. పలు సంఘాలకు చెందిన నూతన సంవత్సర క్యాలెండర్ లను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.