సీఎం హోదా లో విదేశాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాలకు వెళ్ళినపుడు అత్యంత బాధ్యతా యుతంగా మాట్లాడాలన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శ్రావణ్….దేశ ,రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయం గా ఇనుమడింప జేయాలి కానీ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చాయి అన్నారు.
ఐటీ ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచారు..ఐటీ ఉద్యోగులు సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నారు. దేశ జీడీపీ లో ఐటీ రంగం వాటా పది శాతం పైనే ఉంది …రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేలా ఫ్యూడల్ లా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అన్నారు. ఐటీ ఉద్యోగులు చెమటోడుస్తూ దేశ ప్రగతి కి తోడ్పడుతున్నారు..రేవంత్ రెడ్డి దావోస్ లో చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి ..వెంటనే ఐటీ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ కూడా రాశాను.. కేటీఆర్ మీద అక్కసు ఉంటే వేరే రకంగా తీర్చుకోవచ్చు ..ఐటీ ఉద్యోగులు ఏం తప్పు చేశారు చెప్పాలన్నారు. శ్రమ గురించి రేవంత్ కు తెలియదు …అందరి శ్రమ తోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అన్నారు. ఐటీ ఉద్యోగులు శ్రమను రేవంత్ రెడ్డి అవమానించారు…ఐటీ ఉద్యోగులను వర్కర్స్ అని రేవంత్ రెడ్డీ అంటున్నారు అన్నారు.
మార్టిన్ లూథర్ కింగ్ ,మహాత్మ గాంధీ అన్ని రకాల శ్రమలకు గుర్తింపు నిస్తూ గొప్ప మాటలు చెప్పారు..వారు చెప్పిన వాక్యాలను రేవంత్ రెడ్డి ఓ సారి చదువుకోవాలి …కే టీ ఆర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేయలేదు ..ఓ సంస్థ అమెరికా మార్కెటింగ్ విభాగానికి అధిపతి గా పని చేశారు అన్నారు. కేటీఆర్ ను చులకనగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ్నుంచి వచ్చారు ?,పెయింటర్ గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు,కే టీ ఆర్ ప్రతిభతోనే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ..లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి అన్నారు. రేవంత్ రెడ్డి కి దావోస్ లో ఉన్న చంద్రబాబు అయినా గడ్డి పెట్టాలి…ఐటీ సంస్థలు రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలి అన్నారు.
Also Read:దేశంలో 100 కోట్లకు చేరువలో ఓటర్లు!

