జయశంకర్ స్ఫూర్తి గీతం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్..

169
ktr minister
- Advertisement -

దేశపతి శ్రీనివాస్ రచించి గానం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తి గీతం వీడియోను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. పాటలో మూడు ఉద్యమాలతో (ముల్కీ, అరవై తొమ్మిది, మలిదశ) ముడిపడిన జయశంకర్ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని పాట ప్రతిబింబించింది. మంచి సాహిత్య విలువలున్న పాటను జయశంకర్ స్మృతిలో రాసి పాడిన దేశపతి శ్రీనివాస్‌ను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

అరుదైన ఫోటోలతో చేసిన చిత్రీకరణను ప్రశంసించారు. యువ దర్శకుడు పూర్ణచందర్ బాదావత్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించగా, బాజీ పాటకు స్వరాలు కూర్చారు.పాట వీడియోను అందంగా ఎడిట్ చేసిన వంశీని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తో పాటు జయశంకర్ గారి కుటుంబసభ్యులు, దేవీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -