- Advertisement -
నూతన నాణేలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 1, 2, 5, 10 నాణేలతోపాటు రూ. 20 నాణేలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త నాణేలను ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 7న (ఆదివారం) ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు.
దృష్టిలోపం ఉన్నవారు కూడా సులభంగా గుర్తించే విధంగా కొత్తనాణేలను తయారుచేశారు. పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం వాటి స్థానంలో 500లు, 2000లను కొత్త నోట్లను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం 10,50 నోట్లలో కొద్ది మార్పులు చేసిన కేంద్రం కొత్త 200 నోటుని కూడా తీసుకువచ్చింది. తాజాగా కొత్త నాణేలు తీసుకురానుంది.
- Advertisement -