కరోనా సంక్షోభంలో కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ..

140
- Advertisement -

కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం రూ.6,28,993 కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజి ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్రం 8 ఆర్థిక ఉపశమన కార్యక్రమాలు ప్రకటించింది. వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రధానంగా చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. అందుకోసం రూ.50 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. ద్వితీయ, తృతీయ స్థాయి పట్టణాల్లో వైద్య సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించింది.

కొవిడ్ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ ప్రకటించింది. అత్యవసర రుణాలకు అదనంగా రూ.1.5 లక్షల కోట్లు ఇస్తున్నట్టు పేర్కొంది. 25 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.1.25 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నట్టు తెలిపింది. వైద్య, ఔషధ రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులకు రుణాలు ఇస్తామని వెల్లడించింది. మిగిలిన రంగాలకు రూ.60 వేల కోట్ల రుణ హామీ ప్రకటించింది.

పర్యాటక రంగాన్ని కూడా ఆదుకుంటామని, అధీకృత ట్రావెల్ ఏజెంట్లు, గైడ్ లకు ఆర్థికసాయం అందించనున్నట్టు కేంద్రం వివరించింది. పర్యాటక ఏజెన్సీలకు రూ.10 లక్షల వరకు, పర్యాటక గైడ్ లకు రూ.1 లక్ష వరకు రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. రుణాల ద్వారా 11 వేల మంది గైడ్ లకు లబ్ది చేకూరుతుందని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -