దేశంలో వ్యాక్సినేషన్‌పై సీరం సంచలన వ్యాఖ్యలు..

67
Adar Poonawalla

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ ప్రకటన చేసింది. దేశ ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ణంగా పెట్టి టీకాలు ఎగుమ‌తి చేయ‌లేదని కోవిషీల్డ్ త‌యారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అద‌ర్ పూన‌వ‌ల్లా అన్నారు. దేశ ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ణంగా పెట్టి తాము టీకాలు ఎగుమ‌తి చేయ‌లేద‌న్నారు.

దేశంలో వ్యాక్సినేష‌న్‌కు స‌హ‌క‌రించేందుకు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు 20 కోట్ల టీకా డోసులు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు వెల్ల‌డించారు. భార‌త్ వంటి దేశంలో 2 నుంచి3 నెల‌ల్లో వ్యాక్సినేష‌న్ చేయ‌లేమ‌న్నారు. భార‌త్‌లో వ్యాక్సినేష‌న్‌లో అనేక స‌వాళ్లు ఉన్నట్లు తెలిపారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా గ‌ల దేశాల్లో భార‌త్ ఒక‌టి అని అన్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్‌కు 2 నుంచి 3 ఏళ్లు ప‌డుతుంద‌న్నారు. అమెరికా కంపెనీల కంటే త‌మ‌కు 2 నెల‌లు ఆల‌స్యంగా అనుమ‌తులు వ‌చ్చాయ‌న్నారు. ఉత్ప‌త్తిప‌రంగా ప్ర‌పంచంలోనే త‌మ‌ది మూడో స్థానమ‌న్నారు. ఈ ఏడాది చివ‌ర‌కు మాత్ర‌మే విదేశాల‌కు టీకాలు స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. క‌రోనాపై యుద్ధానికి అంతా క‌లిసిక‌ట్టుగా పోరాడాలని సీరం పిలుపునిచ్చింది.