సింగరేణిలో మెగా టీకా డ్రైవ్‌..

110
vaccination drive
- Advertisement -

కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం నుండి సింగరేణి సంస్థ కార్మికులకు టీకా కార్యక్రమం చేపట్టింది. ఇందుకు మెగా టీకా డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. సంస్థకు చెందిన 45 వేల మంది కార్మికుల్లో ఇప్పటికే 16 వేల మందికి మొదటి డోసు వాక్సినేషన్ పూర్తి చేశామని చెప్పారు.

మిగిలిన 29 వేల మందికి పది రోజుల్లోగా టీకాలు వేసే ప్రక్రియను పూర్తి చేస్తామని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్మికులకు వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులో ఉండేలా సింగరేణి దవాఖానలు, డిస్పెన్సరీలు, కమ్యూనిటీ హాల్స్‌లో వాక్సినేషన్ కేంద్రాలను మార్చినట్లు చెప్పారు. డైరెక్టర్ల పర్యవేక్షణలో మెగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అవకాశాన్ని కార్మికులందరూ వినియోగించుకోవాలని సీఎండీ కోరారు.

- Advertisement -