నేల టిక్కెట్టు నిర్మాతతోనే.. మరో రెండు సినిమాలు..

296
Nela Ticket producer two more projects Raviteja Filims
- Advertisement -

టాలీవుడు మాస్ హీరో రవితేజ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నేల టిక్కెట్లు మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. తన మాస్ ఫాలోయింగ్‎ని దృష్టిలో పెట్టుకుని ఎంచుకున్న కథ నేల టిక్కెట్టు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ టీజర్తో‎ మాస్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేశారు రవితేజ. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. రవితేజ చేయబోయే మరో రెండు సినిమాలను కూడా రామ్ తాళ్లూరితో చేయడానికి మాస్ మహారాజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

Nela Ticket producer two more projects Raviteja Filims

మరోవైపు మాస్ మహారాజ రవితేజ తన తదుపరి చిత్రం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని చిత్రాన్ని చేయనున్నాడు. శ్రీనువైట్ల ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో ప్రారంభించారట త్వరలో రవితేజ కూడా షూటింగ్‎లో పాల్గొననున్నారని సమాచారం. ఇక రవితేజ అభిమానులు నేల టిక్కెట్టు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

- Advertisement -