బాలీవుడ్ నటితో కాంగ్రెస్ ఎంపీ డ్యాన్స్‌.. వీడియో

190
MP Saugata Roy

కోల్‌కతాలో గురువారం నాడు టీఎంసీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ హాజరైంది… ఇందులో ఏం విశేషం ఉందనేగా మీ అనుమానం.. అసలు విషయం ఏంటంటే.. రవీనా టాండన్‌తో కలసి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సౌగతా రాయ్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ మారింది.

ఈ కార్యక్రమంలో తనతో కలసి డ్యాన్స్ చేయాలని ఎంపీ సౌగతా రాయ్‌ను రవీనా కోరగా, ఆమెతో కలసి ఆయన ఉత్సాహంగా డ్యాన్స్‌ వేశారు. 1994లో విడుదలైన బాలీవుడ్‌ సూపర్ హిట్ మూవీ ‘మెహ్రా’లోని ‘తూ చీజ్ బడీహై మస్త్ మస్త్’ సాంగ్‌కు రవీనాతో కలసి కాలు కదిపారు. అంతేకాదు తమతో పాటు స్టెప్పులేయాలని వేదికపై ఉన్న ఇతర నేతలను కూడా రవీనా ఆహ్వానించింది. దాంతో అక్కడున్న వాళ్లు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గోన్నారు.

TMC MP Saugata Roy dancing with Raveena Tondon!