డ్రగ్స్‌ అమ్మే పాత్రలో నయనతార..

347
Nayanthara
- Advertisement -

సౌత్ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్‌గా నయనతారకు దూసుకుపోతుంది. అటు హీరోల సరసన హీరోయిన్‌గా నటించడంతోపాటు ఇటు మహిళా ప్రాధన్యత కలిగిన చిత్రాలు చేస్తు నయన్‌ తన హవా కొనసాగిస్తోంది. నయన్‌ తాజాగా ‘కొలమావు కోకిల’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటి వరకు నయనతార చేయని ఓ పాత్రని ఈ సినిమాలో చేయబోతుంది.

Nayanthara

ఈ మూవీలో డ్రగ్స్‌ అమ్మే పాత్రలో నయనతార కనిపిస్తుందని సమాచారం. దర్శకుడు నెల్సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. డార్క్ కామెడీ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార చెల్లిగా టీవీ యాక్టర్ జాక్వెలిన్ పరిచయం కాబోతోంది. ఇతర పాత్రల్లో శరణ్య – నవీన్ కుమార్ నటిస్తున్నారు.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఈ నెలలోనే విడుదలకు సిద్దమౌతుంది. ఇక కొలమావు కోకిల తెలుగు డబ్బింగ్ వెర్షన్ గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నయనతార కీలక పాత్రలో రూపొందిస్తోన్న కొలమావు కోకిల అనే సినిమా ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -