భారతీయుడు 2 ఫస్ట్ లుక్..

192

విలక్షణ నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో భారీ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి అదే రికార్డును రిపీట్ చేసేందుకు దర్శకుడు శంకర్ సిద్ధమయ్యారు. తాజాగా ‘ఇండియన్-2’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను శంకర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులకు పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు.

Kamal Haasan

జనవరి 18 నుంచి భారతీయుడు 2 సెట్స్ పైకి వెళుతోంది. తమిళంలో ఇండియన్ 2 – హిందీలో హిందూస్తాన్ 2 పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. మారిన కాన్వాసులో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేసే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. 2.0 వరల్డ్ వైడ్ రిలీజ్ ఘనవిజయం అందుకున్న నేపథ్యంలో భారతీయుడు 2 చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించేందుకు లైకా సంస్థ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 500కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం.

ఇక తండ్రి సేనాపతి పాత్రలో కమల్ మర్మకళను ప్రదర్శిస్తున్నట్లు ఉన్న పోస్టర్‌ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్‌‌ సరసన కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది.