కొండూరు రవీందర్రావుకు జాతీయ గుర్తింపు

285
Ravindra Rao
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్రావు జాతీయ కోపరేటివ్ బ్యాంకుల సమాఖ్య (NAFCOB- నాఫ్కాబ్) చైర్మన్‌గా ఈరోజు ఎన్నికయ్యారు. దేశంలోని 34 స్టేట్ కోపరేటివ్ బ్యాంకులు, 393 జిల్లా కోపరేటివ్ బ్యాంకులు, 90వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు ఈ జాతీయ కోపరేటివ్ బ్యాంక్ సమాఖ్యలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సమాఖ్య కి తెలంగాణకు చెందిన కొండూరు రవీందర్రావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

రానున్న ఐదు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొండూరు రవీందర్రావు చైర్మన్గా కొనసాగుతారు. 1965లో ఏర్పడిన ఈ సమాఖ్య చైర్మన్‌గా తొలిసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి ఎంపికయ్యారు. చైర్మన్‌గా ఎంపికైన కొండూరు రవీందర్రావుకి అంతర్జాతీయ కోపరేటివ్ ఆలయన్స్ వైస్ చైర్మన్ మరియు ఎంపీ చంద్ర పాల్ సింగ్ యాదవ్, నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతల అభినందనలు తెలియజేశారు.

- Advertisement -