జాతీయ విద్యా విధానంపై కేంద్రం కసరత్తు..

87
national education policy

జాతీయ విద్యా విధానం-2020 అమలుపై సూచనలు, సలహాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సలహాలను స్వీకరించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లిటరసీకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఉపాధ్యాయుల సలహాలను ఎన్‌.సీ.ఈ.ఆర్‌.టి నిపుణుల బృందం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.ఈమేరకు అన్ని రాష్ట్రాల పాఠశాల విద్యాశాఖ కార్యదర్శులకు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనిత కర్వాల్‌ లేఖ రాశారు.