నారా రోహిత్‌ అతిథిగా బ్రోచేవారెవరురా…ప్రీ రిలీజ్

451
brochevarevarura
- Advertisement -

మెంటల్ మదిలో వంటి హిట్ చిత్రాన్ని అందించిన వివేక్ ఆత్రేయ బ్రోచేవారెవరురా అంటూ మరో డిఫరెంట్ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా నివేత థామస్ హీరోయిన్‌గా సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రదారులుగా మన్యం ప్రొడక్షన్ పతాకంపై విజయకుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు.

షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించనుంది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నారా రోహిత్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు సైబర్ కన్వెన్షన్,హైటెక్స్ రోడ్‌,కొండాపూర్‌లో జరగనుంది.

ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయకుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -