ట్విట్టర్ రివ్యూ….‘బ్రోచేవారెవరురా’

487
brochevarevaruraa
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తోంది. చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ వసూళ్లను రాబడుతుంటంతో చిన్న సినిమాలను తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. తాజాగా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న హీరో శ్రీ విష్ణు తాజాగా బ్రోచేవారెవరురా అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రీమియర్‌ షో నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.

శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కగా ప్రమోషన్ కార్యక్రమాలతోనే అందరి అటెన్షన్‌ కొట్టేయగా ఇప్పటికే యూఎస్‌లో తొలి ప్రీమియర్ షో పడిపోయింది. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని అంటున్నారు.

సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ నటన అద్భుతంగా ఉందని నివేదా సినిమాకు మరింత గ్లామర్ తెచ్చిందని చెబుతున్నారు. కొంత మంది అయితే ఇప్పటి వరకు థియేటర్‌లో ఇంతలా తాము నవ్వలేదని ట్వీట్లు చేస్తున్నారు. ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్‌ సొంతం చేసుకున్న శ్రీ విష్ణు బ్రోచేవారెవరురాతో హిట్ కొట్టినట్టే..

- Advertisement -