సిగరెట్ తాగిన వివాదంపై హీరో రామ్!

393
hero ram
- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్‌ ఇస్మార్ట్ శంకర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా హైదరాబాద్‌ లాంగ్వేజ్‌ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చార్మినార్ వద్ద ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ జరుగుతుండగా హీరో రామ్ బహిరంగంగా సిగరెట్ కాల్చడంతో పోలీసులు ఫైన్ వేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సిగరెట్ వివాదంపై స్పందించారు రామ్‌. నా టైమూ, పబ్లిక్ టైమూ వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే… షాల్ లా కాల్చినా తమ్మీ, బ్రేక్ లా కాద్. టైటిల్ సాంగ్ లా చూస్తావుగా స్టెప్పు. ఫిర్ భీ లాకి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం. గపుడు నువ్వు కూడా నా లెక్క. లైట్ తీస్కో పని చూస్కో… ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్” అని ట్వీట్ పెట్టాడు.

- Advertisement -