న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ మూవీ బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈచిత్రం శరవేగంగా చిత్రకరణ జరుపుకుంటోంది. ఈచిత్రంలో నాని సరసన కథానాయికగా శ్రధ్దా శ్రీనాథ్ నటిస్తుంది. ఈమూవీలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఎప్రిల్ లో ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రనిర్మాతలు. ఈమూవీ తర్వాత నానీ దర్శకుడు విక్రమ్ కుమార్ తో సినిమా చేయనున్నాడు. ప్రత్యేకమైన కథతో ఈచిత్రం తెరకెక్కనుందని సమాచారం.
అందుకు తగ్గట్టుగా దర్శకుడు విక్రమ్ కుమార్ స్క్రీప్ట్ రెడీ చేస్తున్నారట. ఈమూవీలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ముగ్గురు కన్ఫామ్ అయినట్టు సమాచారం. నానితో ‘నేను లోకల్’లో నటించిన కీర్తి సురేష్ , మేఘా ఆకాష్, ప్రియా వారియర్ లు కన్ఫామ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఓ హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఈసినిమాను రూపొందించనున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది.