నేను లోక‌ల్ ద‌ర్శ‌కుడితో వెంక‌టేశ్

432
trinad rao nakkina venkatesh
- Advertisement -
విక్ట‌రీ వెంక‌టేశ్ చాలా రోజుల త‌ర్వాత పుల్ లెన్త్ కామెడీ పాత్ర‌లో కనిపించిన చిత్రం ఎఫ్2. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఎఫ్ 2 మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈచిత్రం బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. త్వ‌ర‌లోనే వెంక‌టేశ్ నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీమామ సినిమాలో న‌టించ‌నున్నాడు. దర్శ‌కుడు బాబీ ఈచిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.
f2 Movie
వెంకీ త‌న త‌ర్వాత సినిమాపై కూడా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం వెంక‌టేశ్ నేను లోక‌ల్ ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటివ‌లే త్రినాథ్ రావు వెంకీ కి క‌థ చెప్పడంతో వెంటనే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట విక్ట‌రీ వెంక‌టేశ్. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తుంది.
 Trinad Rao Nakkina
సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.  ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్’ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న త్రినాధరావు నక్కిన ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాల‌నే ఎదురుచూస్తున్నాడు ద‌ర్శ‌కుడు త్రినాధ్ రావు న‌క్కిన.
- Advertisement -