సాగర్‌,శ్రీశైలంకు పోటెత్తిన వరదనీరు

272
nagarjuna sagar

భారీ వర్షాలతో శ్రీశైలం,నాగార్జున సాగర్‌కు వరదనీరు భారీగా పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయానికి వ‌ర‌ద భారీగా పెరగడంతో 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,29,151 క్యూసెక్కులుగా ఉండ‌గా ఔట్ ఫ్లో 4,03,197 క్యూసెక్కులుగా ఉంది. శ్రీ‌శైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగులుగా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొన‌సాగుతోంది.

దీంతో శ్రీ‌శైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు అధికారులు. 10 క్రస్టుగేట్లు 15 ఫీట్ల మేర‌, 8 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర.. మొత్తం 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.00 అడుగులుగా ఉంది.