తేజు బర్త్ డే….చిరు స్పెషల్ విషెస్

135
saidhram tej

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ 34వ బర్త్ డే సందర్భంగా పలువురు సెలబ్రెటీలు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం తేజుకి స్పెషల్ బర్త్ డే విష్ చేస్తూ సోలో బ్రతుకే సో బెటరు సినిమాలోని అమృత పాటను విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా హ్యాపీ బ‌ర్త్‌డే తేజ్.. సోలోగా ఉన్న‌ప్పుడే ఎంజాయ్ చేయ్. నీ బ్యాచిల‌ర్ లైఫ్ ఇంకొన్ని రోజులే అంటూ పేర్కొన్నారు.

మెగాస్టార్ విషెస్‌తో ఉప్పొంగిపోయారు తేజు. ఇది పుట్టిన రోజు నాడు ఉత్తమ బహుమతి … ఈ బ‌ర్త్‌డేని మరింత ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు …మిమ్మ‌ల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాను అని మామకు ధన్యవాదాలు తెలిపారు. మీ ఆశీర్వాదం క‌న్నా మరేదీ అడ‌గ‌ను . థ్యాంక్యూ సో మ‌చ్ మామా అంటూ పేర్కొన్నారు.