సీఎం కేసీఆర్‌తో నాగం, విష్ణు భేటీ

36
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పిజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి… బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ని కలిశారు మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి.

ఇక కేసీఆర్‌తో సమావేశం కంటే ముందు నాగంను కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మంత్రి హరీశ్‌ రావు. హైదరాబాద్‌లోని నాగం నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ క్రమంలో నాగం జనార్దన్‌ రెడ్డిని మంత్రులు బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై.. ఆ తర్వాత ముహూర్తం నిర్ణయించుకొని బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతానని కార్యకర్తల సాక్షిగా తెలుపుతున్నానన్నారు. కాంగ్రెస్‌లో పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేశాయన్నారు.

Also Read:కాంగ్రెస్‌కు నాగం రాజీనామా..త్వరలో బీఆర్ఎస్‌లోకి!

- Advertisement -