ఇంగ్లాండ్ చెత్త ప్రదర్శన..ఆగని భారత్ జైత్రయాత్ర

26
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఇంగ్లీష్ జట్టు వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకోగా భారత్ వరుసగా 6వ విజయాన్ని నమోదుచేసి సెమీస్‌కు మరింత చేరువైంది. భారత్ విధించిన 230 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయి 100 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (27) టాప్‌ స్కోరర్‌ కాగా జో రూట్‌ (0), బెన్‌ స్టోక్స్‌ (0), జానీ బెయిర్‌స్టో (14), డేవిడ్‌ మలాన్‌ (16), జోస్‌ బట్లర్‌ (10), మోయిన్‌ అలీ (15), క్రిస్‌ వోక్స్‌ (10) కీలక ఆటగాళ్లంతా విఫలమయ్యారు.కనీస పోరాట పటిమ కూడా కనబర్చకుండానే ఇంగ్లాండ్ ఓటమి కావడం ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమీ 4, బుమ్రా 3 వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 87,49,కేఎల్‌ రాహుల్‌ (39) పరుగులతో రాణించారు. దీంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రోహిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా గురువారం శ్రీలంకతో తలపడనుంది భారత్‌.

Also Read:కాంగ్రెస్‌కు నాగం రాజీనామా..త్వరలో బీఆర్ఎస్‌లోకి!

- Advertisement -