రెండు దేశాలు ఒకే ఇంట్లో….

44
- Advertisement -

అనగానగా ఒక చిన్న ఊరు… పేరు లాంగ్వా. అన్ని ఊళ్లకి మళ్లేలా ఉండదు. దీనికో  ప్రత్యేకత ఉంది. ఈ ఊరు ఏకంగా రెండు దేశాల మధ్యనే ఉంది. ఆవును ఇది నిజం. నాగాలాండ్‌లోని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది భారత్ మయన్మార్‌ దేశాల సరిహద్దుగా ఉంది. లాంగ్వాలో ఎక్కువగా కొన్యాక్‌ నాగా తెగకు చెందిన వారే  నివసిస్తుంటారు. ఈ తెగకు ఆంగ్ అనే వ్యక్తి అధిపతిగా అక్కడి ప్రజలు నియమించుకుంటారు. అయితే ఆంగ్ నివసించే ఇల్లు మాత్రం భారత్-మయన్మార్ ను వేరు చేస్తుంది.

ఇంట్లోని వంటగది మయన్మార్‌లో ఉండగా…బెడ్‌రూమ్‌ మాత్రం భారత్‌లో ఉంటుంది. అయితే ఈ ఇంటికి సంబంధించిన ఒక వీడియోను నాగాలాండ్ మంత్రి టెమ్జేన్‌ఇమ్నా ఆలోంగ్ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన వారందరూ…ఆ కుటంబ సభ్యులు భారత్‌లో పడుకుంటారు. మయన్మార్‌లో తింటారు అంటూ రీట్విట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

భవిష్యత్తులో ఢిల్లీ ప్రజల దీన స్థితి…

భూతల్లికి రైతు తెలిపే కృతజ్ఞత సంక్రాంతి..

జోడో యాత్రలో విషాదం…

- Advertisement -