కరోనా నుండి బయటపడ్డ నాగబాబు..

101
naga babu

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన నాగబాబు త్వరగా కరోనాను జయించి ఫ్లాస్మా దానం చేస్తానని తెలిపారు.. అయితే ప్ర‌స్తుతం తాను క‌రోనాను జ‌యించిన‌ట్టు తెలిపిన నాగ‌బాబు.. హోం ఐసోలేషన్ తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలు, తీసుకున్న జాగ్రత్తలు, కోలుకున్న విధానాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు. కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా నాగబాబు సూచించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు తాను ఐదు సార్లు క‌రోనా టెస్ట్ చేయించుకున్న‌ట్టు తెలిపిన నాగ‌బాబు.. నిహారిక నిశ్చితార్ధానికి ముందు కూడా క‌రోనా టెస్ట్ చేయించుకున్న‌ట్టు పేర్కొన్నాడు. అయితే ఇటీవ‌ల కాస్త చ‌లి జ్వ‌రంతో పాటు మ‌త్తుగా అనిపించ‌డంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింద‌ని అన్నారు నాగ‌బాబు.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు,సినీ నిర్మాతలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి,కీరవాణి వంటి వారు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పనిచేసే వారికి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కరోనా సోకి ఇటీవలే మరణించారు.

Naga babu's Recovery Story and Message to Patients | #NagababuTalks #RecoveryPeriod