భర్తపై పూనమ్‌ పాండే షాకింగ్‌ కామెంట్‌..

38
poonam

బాలీవుడ్ బ్యూటీ పూనమ్‌ పాండే.. సామ్‌ అహ్మద్‌ బాంబే అనే దర్శకుడిని ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే పెళ్లయి నెల కూడా తిరగకుండానే సామ్‌ తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. ఈ నెల 22వ తేదీన సామ్‌ బాంబే బెయిల్‌పై రిలీజ్‌ అయ్యారు. ఈనేపథ్యంలో భర్తతో విడిపోవడానికి సిద్దమైంది పూనమ్‌. కాగా తాజాగా ఈ అమ్మడు మరో ఆసక్తికర విషయం వెల్లడించింది.

పూనమ్‌ తన భర్తతో కలిసిపోయి వైవాహిక జీవితాన్ని మళ్లీ కొనసాగించాలని భావిస్తోందట. ఈ మేరకు శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. అంతేకాకుండా ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌తో ఆమె మాట్లాడుతూ..‘‘మా మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకున్నాం. మళ్లీ కలిసి ఉండబోతున్నాం. మీకు తెలుసా? మేమిద్దం ఒకరిని ఒకరం చాలా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం పిచ్చి ప్రేమలో ఉన్నాం. వైవాహిక జీవితంలోని హెచ్చు, తగ్గులు మమ్మల్ని ఆపలేవ’’ని తెలిపారు. సామ్‌ బాంబే కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇద్దరూ కలిసి ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు.