ఏకాదశి.. యాదాద్రిలో భక్తుల రద్దీ..

122
Yadagirigutta
Yadagirigutta

ఆదివారం కావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఇవ్వాళ ఏకాదశి కావడంతో స్వామివారి కి ,అమ్మవారి కి ప్రత్యేకంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు అర్చకులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అడుగడుగునా తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఆలయ అధికారులు. క్యూ లైన్ లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి మూడు గంటలకు ఒక సారి ఆలయం మొత్తాన్ని శానిటేషన్ చేస్తూ భక్తుల ఆరోగ్య సంరక్షణ కు చర్యలు చేపటారు.