ఐపీఎల్ 2020..ఫైనల్లో ముంబై

218
mumbai
- Advertisement -

ఐపీఎల్ 2020లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌ 1లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ముంబై అదరగొట్టింది. ఢిల్లీపై 57 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 143 పరుగులు చేసింది. భారీ స్కోరు చేయాల్సిన తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ టాప్‌ ఆర్డర్ చేతులెత్తేసింది. ఓపెనర్లు పృథ్వీ షా,ధావన్,రహానే డకౌట్‌గా వెనుదిరుగగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 12,పంత్ 3 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు స్టాయినిస్ మాత్రం ధాటిగా ఆడాడు. 46 బంతుల్లో 3 సిక్స్‌లు,6 ఫోర్లతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్ 42 పరుగులు చేసి రాణించాడు.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 200 పరుగులు చేసింది. ఆదిలోనే ముంబైకి రోహిత్ శర్మ రూపంలో ఎదురుదెబ్బ తగిలిన ముంబై స్కోరును పరుగులు పెట్టించారు డికాక్, సూర్యకుమార్ యాదవ్. సూర్య కుమార్ యాదవ్‌(51), ఇషాన్‌ కిషన్‌ (55), క్వింటన్‌ డికాక్‌(40),పాండ్యా (37) పరుగులు చేయడంతో ముంబై భారీ స్కోరు సాధించింది.

- Advertisement -