తెలంగాణ ఖ్యాతిని చాటేలా నూతన సచివాలయ నిర్మాణం..

218
prashanth
- Advertisement -

నూతన సచివాలయ నిర్మాణ పనులపై ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో గురువారం సంబంధిత శాఖ అధికారులు, వర్క్ ఏజెన్సీ తో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…”గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు 12 నెలల్లో సెక్రటేరియట్ బిల్డింగ్ పనులు పూర్తి కావాలి.మొత్తం బిల్డింగ్ ను 6 ప్రాజెక్ట్ లుగా విభజించి ఒక్కో ప్రాజెక్ట్ భాగానికి ఒక్కో వర్కింగ్ టీమ్ అంటే మొత్తం 6 వర్కింగ్ టీమ్ లను ఏర్పాటు చేసుకోవాలి.డిపార్ట్మెంట్ వైపు నుండి 6+6=12 J.E లను,3 గురు D.E లను,ఒక్కరు E.E మరియు ఒక్కరు S.E ని ప్రత్యేకంగా నియమించుకోవాలన్నారు.

వీరికి అదనంగా ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ పనుల కోసం ముగ్గురు J. E లను,ఇద్దరు D. E లను,ఒక్కరు E.E లను నియమించుకోవాలి…షాపూర్ జి సంస్థ నుండి కూడా
6+6 = 12 ఫీల్డ్ ఇంజనీర్లను , 6 గురు ప్రాజెక్ట్ ఇంజనీర్లను,ఒక్క ప్రాజెక్ట్ మేనేజర్ ని నియమించుకోవాలి.ఆర్కిటెక్ట్ వైపు నుండి కూడా 6 సూపర్వైజింగ్ టీమ్ లను సైట్ లో నియమించాలి. డిపార్ట్మెంట్ SE, ఆర్కిటెక్ట్ మరియు షాపూర్ జి సంస్థలు ముగ్గురు కలిసి , ప్రాజెక్ట్ ను ప్రతి నెల వారిగా ఏ ఏ పనులు పూర్తి చేయాలో..11 నెలలను టార్గెట్ గా తీసుకొని PERT CHART వెంటనే తయారు చేయ్యాలన్నారు.

EXPANSION JOINT ల పనులను నాణ్యతతో చేయటానికి ప్రపంచంలోని ఉత్తమమైన టెక్నాలజీ ని వాడాలి. ప్రతివారం నేను స్వయంగా సైట్ కి వచ్చి పనులను పర్యవేక్షిస్తా.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా దేశం అబ్బురపడేలా,తెలంగాణ ఖ్యాతిని చాటేలా సెక్రటేరియట్ నిర్మాణం ఉండాలి.” అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్.ఈ సత్యనారాయణ, ఈ.ఈ శశిధర్,వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు,వాస్తు నిపుణులు సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -