- Advertisement -
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముకేశ్ అంబానీ సోమవారం భారీ విరాళాన్ని సమర్పించారు. ఆయన రూ. 1,11,11,111 మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ఈ విరాళాన్ని అందించి, ప్రాణాపాయంలో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు.
ఈ మేరకు సంస్థ ప్రతినిధి ఒకరిని తిరుమలకు పంపించి, విరాళాన్ని అందించారు. తిరుమలలోని దాతల విభాగంలో ఈ విరాళం చెక్కును అధికారులు స్వీకరించారు. గతంలోనూ ముఖేష్ అంబానీ పలుమార్లు వెంకటేశ్వరునికి కోట్లాది రూపాయలను విరాళంగా సమర్పించారు.
- Advertisement -