జంట పేలుళ్ల కేసులో సంచలన తీర్పు..

268
- Advertisement -

హైదరాబాద్‌ నగరంలో జరిగిన జంట పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడైంది. గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నాంపల్లి కోర్టు న్యాయమూర్తి తుది తీర్పును ఇవాళ వెల్లడించారు. ఈ ఘటన జరిగిన 11ఏళ్ల తర్వాత కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తం అయిదుగురు నిందితుల్లో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. అక్బర్ ఇస్మాయిల్, అనిక్ షరీక్ సయిద్‌‌లను దోషులుగా నిర్ధారించింది. వీరికి ఈ నెల 10న శిక్షలు ఖరారు చేయనున్నారు.

Hyderabad Twin Blasts

2007, ఆగస్టు 25న సాయంత్రం జరిగిన గోకుల్‌చాట్, లుంబినీ పార్కు పేలుళ్లలో 44 మంది మృతి చెందగా, 68 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల కేసు విచారణ దాదాపు 11 ఏండ్ల పాటు కొనసాగింది. ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పేలుళ్లకు పాల్పడిన మొదటి సంఘటన ఇదే. ఈ పేలుళ్లతో సంబంధమున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్ఫూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ రియాజ్ భత్కల్ పాకిస్తాన్, దుబాయ్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు నిఘా, పలు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

- Advertisement -