భగ్గుమంటున్న పెట్రోల్‌-డీజిల్ ధరలు..!

365
Petrol price in Hyderabad
- Advertisement -

రోజు రోజుకు పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడ అదే రీతిలో పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో కలుపుకొంటే వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోంది. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇతర రాష్ట్రాలతో పోలీస్తే ఎక్కువగా ఉన్నాయి. లీటరు పెట్రోలు వంద రూపాయలు చేసేస్తారేమో అనిపిస్తుంది.. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమవుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. స్టాక్ మార్కెట్లు నెల రోజుల తర్వాత భారీ పతనానికి గురయ్యాయి.

Petrol price in Hyderabad

రూపాయి మారకం జీవన కాల కనీస స్థాయికి పతనం కావడం, మరోవైపు క్రూడాయిల్ ధరలు 78 డాలర్లకు చేరుకోవడంతో శుక్రవారం నాడు వెలువడిన ప్రోత్సాహకర జీడీపీ గణాంకాలు ప్రయోజనం లేకుండా పోయాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు భగ్గుమన్నాయి. ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. డాలర్ మారకంతో క్రూడాయిల్ దిగుమతి భారం ఒకవైపు క్రూడాయిల్ భారంతో పెట్రో మంట మరోవైపు సామాన్యుని నడ్డి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు స్టాక్‌మార్కెట్ పెరుగుదల మునగ చెట్టు మీద ఉంది. కొమ్మ విరిగేపడే సూచనలూ కనిపిస్తున్నాయి.

Petrol price in Hyderabad

దేశంలో వివిధ రాష్ట్రల్లో పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. ఢిల్లో లీటర్ పెట్రోలు ధర 31 పైసలు పెరిగి రూ.79.15కి చేరుకోగా, డీజీల్ ధర 39 పైసలు పెరిగి రూ. 71.15 కు చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ. 86.56కు, లీటర్ డీజిల్ ధ 75.54కు పెరిగింది. కాగా, హైదరాబాద్ లీటర్ పెట్రోలు ధర 33 పైసలు పెరిగి రూ. 83.92 కు చేరుకోగా, లీటర్ డీజీల్ ధర 42 పైసలు పెరిగి రూ. 77.39 కు చేరింది. రూపాయి మారకం విలువ రూ.71ని దాటడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌అయిల్ ధరలు గత 15 రోజుల్లో బ్యారెల్‌కు 7 డాలర్లు పెరిగి 78 డాలర్ల కు చేరడంతో దేశంలో పెట్రో ధరలు పెరిగినట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.

- Advertisement -