సీఎంఆర్ఎఫ్ కి 5 కోట్ల సాయం అందజేసిన MSN ఔషధ సంస్థ..

215
- Advertisement -

ముఖ్యమంత్రి సహాయనిధికి ఎం.ఎస్.ఎన్ ఔషధ పరిశ్రమ అధినేత డాక్టర్.ఎమ్ ఎస్ ఎన్ రెడ్డి ఐదు కోట్ల రూపాయలు ప్రకటించారు. కంపెనీ అధినేత డాక్టర్.ఎమ్ ఎస్ ఎన్ రెడ్డి తో పాటు మన్నే జీవన్ రెడ్డి మరియు భరత్ రెడ్డిలు సీఎం కేసీఆర్ ను కలిసారు. ఈ సందర్భంగా డాక్టర్.ఎమ్మెసెన్ రెడ్డి రాష్ట్రం కరోనా వైరస్ రూపంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ తమ వంతు సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు కోట్ల రూపాయలు విలువ గల వైద్యులకు మరియు సిబ్బందికి కావలసిన కరోనా రక్షణ కీట్లను (PPE kits) ఆందచేస్తునట్లు తెలిపారు.

భవిష్యత్తులో ఔషధ పరమైన ఏలాంటి సహకారాన్ని అందించడానికి అయినా తాము తమ సంస్థ సిద్ధంగా ఉంటుందని సీఎం కేసీఆర్ తో డాక్టర్.ఎం ఎస్ ఎన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే మహబూబ్ నగర్ మరియు సంగారెడ్డి జిల్లాలో ఎం ఎస్ ఎన్ ఫౌండేషన్ తరఫున 50 లక్షల విలువైన శానిటైజర్ మరియు సబ్బులను ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఏమ్మేసెన్ సంస్థ అధినేత డాక్టర్.ఎమ్మెసెన్ రెడ్డి ని మరియు మన్నే జీవన్ రెడ్డి, భరత్ రెడ్డి లను అభినందించారు.

- Advertisement -