మజ్ను..5 మిలియన్ వ్యూస్

254
Mr Majnu

అక్కినేని అఖిల్ న‌టించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో మజ్నుగా ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన వెంకీ అట్లూరి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే రిలీజయిన టీజర్, టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించగా తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ.. నావల్ల ఒక్కరు ఏడ్చినా అది కచ్చితంగా నా తప్పు అవుతుంది , ఇప్పుడు లవ్‌ అంటే.. ముందు కొంచెం లవ్‌చేసుకుని, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువగా లవ్‌చేసుకుని.. లాస్ట్‌లో పెళ్లి చేసుకుంటారు ఆ టైప్‌ లవ్వా.. నాకు అలా లవ్‌ చేయడం చేతకాదు’ అనే డైలాగ్‌లు హైలెట్‌ అయ్యాయి.

ఈ చిత్రంలో అఖిల్ సరసన క‌థానాయిక‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Mr Majnu Theatrical Trailer | Akhil Akkineni | Nidhhi Agerwal | Thaman S | Venky Atluri | SVCC