అజయ్ దేవగణ్‌కు థ్యాంక్స్ చెప్పిన ఎంపీ సంతోష్..

35
mp santosh

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు టీఆర్ఎస్ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ థ్యాంక్స్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని దండుమైలారం ఇండస్ట్రియల్ పార్కులో అజయ్ దేవగణ్ 6 నెలల క్రితం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం అజయ్ దేవగణ్ ఎన్‌వై ఫౌండేషన్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. తన ఫౌండేషన్ కార్యక్రమాల్లో సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను భాగస్వామ్యం చేస్తూ అజయ్ దేవగణ్ మొక్కలు నాటారు.

అయితే ఇప్పుడు ఆ మొక్కలు పెద్దయి పువ్వులు పూస్తూ ఆహ్లాదాన్ని అందిస్తున్నాయని సంతోష్ కుమార్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా అజయ్ దేవగణ్‌కు థ్యాంక్స్ చెప్పిన ఎంపీ సంతోష్ మొక్కలు పెరిగి పూలు పూసి ఆకట్టుకుంటున్న వీడియోను కూడా షేర్ చేశారు.