నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి..

25
Indrakaran Reddy

నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో స్ఫూర్తి, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 135 మందికి అర్చకులు, ప్రైవేట్ టీచర్లకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన అర్చకులు, ఉపాధ్యాయులకు నరేష్, డాక్టర్ ప్రవీణ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

ప్రభుత్వం సైతం ప్రెవేట్ ఉపాధ్యాయులను ఆదుకుందన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి నరేష్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ నెలకు తనకు తోచినంత సహాయం చేస్తున్నాడాని అతన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు మంత్రి అల్లోల. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, fscs చైర్మన్ ధర్మజి రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, వైస్ చైర్మన్ సాజిద్ , కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు , డాక్టర్ దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.