ఎంపీ నవనీత్‌కు థ్యాంక్స్‌ చెప్పిన సంతోష్ కుమార్

181
navneet kaur

సినీ నటి,ఎంపీ నవనీత్ కౌర్‌కు థ్యాంక్స్ చెప్పారు ఎంపీ సంతోష్ కుమార్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటడం ఎంతో మందికి స్పూర్తినిస్తుందని ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంతోష్.. తెలుగు రాష్ట్రాల్లోని మీ ఫ్యాన్స్‌తో పాటు మహారాష్ట్రలోని మీ అభిమానులు, అనచరులు గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొంటారని ఆశీస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవాళ ఉదయం తన నివాసంలో మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని నెలలుగా నేను చూస్తున్నాను త చిత్ర పరిశ్రమకు చెందిన అదేవిధంగా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరుగుతోందని అని… మా తోటి పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు కావాలని ఉద్దేశంతో ఈరోజు మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.