బిగ్ బాస్ 4…5వ వారం ఓటింగ్ లో టాప్ ఎవరో తెలుసా!

302
nagarjuna

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 30 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఐదో వారం ఎలిమినేషన్‌కు 9 మంది నామినేట్ అయ్యారు. అఖిల్,నోయల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా‌లు ఉండగా వీరిలో ఎవరూ హౌస్ నుండి బయటకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ మొదలుకాగా 57 వేల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 38.94 శాతం ఓట్లతో అభిజిత్ టాప్‌లో నిలిచారు. అఖిల్ 20.52,సొహైల్ 9.73,లాస్య 8.95,నోయల్ 7.92,అరియానా 6.33,మొనాల్ 3.87,అమ్మ రాజశేఖర్ 1.89,సుజాత 1.86 శాతం ఓట్లతో ఉన్నారు.

ఇప్పటివరకు మొదటివారంలో సూర్య కిరణ్, రెండవ వారంలో కరాటే కల్యాణి,మూడవ వారంలో దేవి నాగవల్లి,నాలుగోవారంలో సాక్షి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యారు. వీరంతా ఓటింగ్‌లో చివరి స్ధానంలో ఉండటంతో హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యారు.