వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అపెక్స్‌ కౌన్సిల్ సమావేశం…

108
apex council

ఢిల్లీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశానికి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వం వహించనుండగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, జల వివాదాలు తదితర అంశాలపై చర్చించనుంది అపెక్స్ కౌన్సిల్. ఇప్పటికే కేంద్ర జల్ శక్తి మంత్రికి 14 పేజీల లేఖ రాసిన సీఎం కేసీఆర్ …అపరిష్కృతంగా ఉన్న జలవివాదలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.