గంగా నది…మీ జీవితంలో ఇలా చూడలేరు: ఎంపీ సంతోష్

539
mp-santhosh-kumar
- Advertisement -

 

దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పవిత్ర గంగానది శుభ్రంగా మారింది. విషపూరిత పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవక పోవడంతో గంగానది శుభ్రంగా మారింది. ఈ నేపథ్యంలో గంగానదికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు ఎంపీ సంతోష్ కుమార్.

గంగా నదిలో నీటి నాణ్యత పెరిగిందని లాక్ డౌన్ ఎత్తివేస్తే మళ్లీ గంగానదిని ఇంత స్వచ్ఛగా లైఫ్‌ టైమ్‌లో చూడలేమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

నమో గంగా పేరుతో గంగా నది పరిశుభ్రం చేయడానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించిన ఫలితం లేకపోయింది. కానీ లాక్ డౌన్ కారణంతో నీటి కాలుష్యమే కాదు.. వాయు కాలుష్యం కూడా అన్ని ప్రాంతాల్లో ప‌డిపోయింది. పర్యాటక స్వర్గధామాలుగా ప్రసిద్ధి చెందిన హరిద్వార్, రిషికేశ్‌లలో గంగా నది నీరు తాగడానికి అనుకూలంగా మారిపోయింది.

- Advertisement -