గంగానదిలో మృతదేహాలు…సుప్రీం కీలక ఆదేశాలు

211
river
- Advertisement -

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కరోనాతో ఉత్తరప్రదేశ్‌ అతలాకుతలం అవుతుండగా భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిలో కరోనా మృతదేహాలు కొట్టుకురావడం, వాటిని కుక్కలు పిక్కుతినడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

గంగానదిలో మృతదేహాలు కొట్టుకురావడంపై వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై స్పందించింది సుప్రీం. గంగా నదిలో మృతదేహాలపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొన్న కేంద్రం.. క‌రోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది.

గంగా నదిలో మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాని ఫిర్యాదులు అందడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ మే 13న స్పందిస్తూ.. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, ఉత్తర ప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -