జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీ బండా ప్రకాష్..

75
MP Banda Prakash

నేడు రాజ్యసభ సభ్యులు డా. బండా ప్రకాష్ తన జన్మదినం పురస్కరించుకుని హన్మకొండలోని నివాసం నందు ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా డా. బండా ప్రకాష్ మాట్లాడుతూ.. తన జన్మదినం సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని కోరారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలలు కంటున్న హరితహారంకు మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని మూడు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు చేయూతనివ్వాలని కోరారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.