కార్తీక్‌,మోర్గాన్‌ మెరుపులు.. కేకేఆర్ 163/5

25
KKR

అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ సన్‌రైజర్స్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని బ్యాట్స్‌మెన్‌ తమదైన శైలిలో ఆడటంతో కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది.

శుభమాన్ గిల్ 36, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 34, నితీష్ రానా 29, దినేష్ కార్తీక్ 29, రాహుల్ త్రిపాఠి 23 పరుగులు చేశారు. రస్సెల్ (9) మినహా అందరూ బాగానే ఆడారు. అయితే ఓపెనర్లు త్రిపాఠి, శుభమాన్ గిల్ మంచి ఆరంభం ఇచ్చినప్పికీ.. అదే జోరును కొనసాగించలేకపోయింది కేకేఆర్. ఆఖర్లో కార్తీక్‌, మోర్గాన్‌ మెరుపులు మెరిపించారు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 58 పరుగులు జోడించడంతో కోల్‌కతా 160 మార్క్‌ దాటింది. ఆఖరి 3 మూడు ఓవర్లలో కోల్‌కతా 42 పరుగులు రాబట్టింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బాలిస్ థంపి, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తలో వికెట్ సాధించారు.