‘మోస్ట్ డిజైరబుల్‌ మ్యాన్’గా ‘అర్జున్ రెడ్డి’..

404
arjun reddy

ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు యూత్ లో అత్యధికంగా క్రేజ్ ఉందంటూ మరోసారి నిరూపితం అయ్యింది. పెళ్లి చూపులు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకొని.. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్‌‌నైట్ స్టార్‌‌గా మారిపోయిన టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ క్రేజ్‌ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ‘హైదరాబాద్ టైమ్స్’ ప్రతి ఏటా ప్రకటించే ‘మోస్ట్ డిజైరబుల్‌ మెన్’ జాబితాలో  చోటు దక్కించుకున్నాడు.

ఇండియాలోని టాప్ 50 మోస్ట్ డిజైరబుల్‌ మెన్ లిస్ట్‌లో విజయ్ ఏకంగా మూడవ స్థానం దక్కించుకున్నారు. 2018, 2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న రౌడీ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో టాప్ 3 ప్లేస్ కైవసం చేసుకోవటం అతని క్రేజ్‌కు నిదర్శనం.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి.