మనోహరాబాద్ రైల్వే పనులు వేగవంతంచేయండి: హరీష్

214
harishrao

మ‌నోహ‌రాబాద్ రైల్వే లైన్ ప‌నుల‌ను వీలైనంత తొంద‌ర‌గా పూర్తి చేయాల‌లని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. ఇది ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన రైల్వే లైన్ అని తెలిపిన హరీష్‌… మనోహరాబాద్ రైల్వే పనుల పురోగతిపై ఎంసీహెచ్‌ఆర్డీలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లా‌కలెక్టర్, రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోని భూసేకరణ పనులు పూర్తి చేయాల‌న్నారు. రైల్వే పనులు జరిగే చోట విద్యుత్ లైన్లు మార్చాల్సి వస్తే ఆ పనులను విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి వేగవంతంగా పూర్తి‌చేయాల‌న్నారు. రైల్వే అధికారులు కూడా కేంద్ర నుంచి వచ్చే వాటా నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు.

మనోహరాబాద్ రైల్వే లైన్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంద‌న్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ ప్రాంతానికి రానున్న‌ట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, ఆర్ అండ్ బి, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.